ప్రతిపాడులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం

83చూసినవారు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం 5వ మైలు వైన్ షాప్ వెనుక వున్న గూడెంలో అక్రమంగా నిల్వ వుంచిన 1070 బస్తాల రేషన్ బియ్యాన్ని శుక్రవారం జిల్లా సివిల్ సప్లై అధికారి కోమలి పద్మ అధికారులతో కలిసి వెళ్లి తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో 1070 రేషన్ బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. బస్తాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్