రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యాథవిథిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు.