ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ పేర్కొన్నారు. మంగళవారం ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆటో యూనియన్లు, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ మహిళా భద్రతపై సీఐ గణేశ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ భవ్య కిషోర్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ముఖ్యంగా మహిళల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.