రాజానగరం మండలంలోని చక్రధ్వారబంధంలో ‘రాఖీ అవెన్యూస్’ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్-2 పేరిట తమ వద్ద డబ్బులు కట్టించుకుని మోసం చేసిందని ఆరోపిస్తూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రిలో బాధితులు మృత్యుంజయరావు, శ్రావణి, నటరాజ్ మాట్లాడుతూ రాఖీ అవెన్యూస్ సంస్థలో దాదాపు రూ.10కోట్ల పెట్టుబడి పెట్టామన్నారు. 4 ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు వాపోయారు.