రాజానగరం: విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే ఆత్మహత్యే దిక్కు
రాజానగరం మండలం కలవచర్ల గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణకు ఆ గ్రామంలో 5 ఎకరాల పొలం ఉంది. అయితే పొలానికి సంబంధించిన బోరుకు విద్యుత్ కనెక్షన్ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తీయించేశారని, వెంటనే విద్యుత్ కనెక్షన్ను పునఃరుద్ధరించాలన్నారు. నీరులేక పంట పండకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని పవన్కళ్యాణ్ ఫొటో ప్లేకార్డుతో పురుగుమందు, ఉరితాడు పట్టుకుని రాజమండ్రిలో ఆయన బుధవారం నిరసన తెలిపారు.