ఏపీ 108 సర్వీస్ లో విధులు నిర్వహిస్తున్న ఈఎంటి, పైలట్లు ఈనెల 25 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమ్మె నోటీసును తహశీల్దార్, ఎంపీడీఓకి అందించారు. 108 నిర్వహణ సంస్థ మార్చిన ప్రతిసారి ఉద్యోగుల గ్రాట్యుటి, సెలవుల సొమ్ము, వార్షిక ఇంక్రిమెంట్స్ ఉద్యోగులకు చెల్లించకుండా మోసం చేస్తున్నారన్నారు. 108 ఉద్యోగులను వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.