మహాసేన రాజేశ్, అతని అనుచరులపై మలికిపురం పోలీస్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో గత కొద్దినెలల క్రితం అభ్యంతరకర పోస్టులు పెట్టారని శాంతి అనే మహిళ ఈనెల 12 ఫిర్యాదు చేశారని ఎస్సై సురేశ్ శుక్రవారం తెలిపారు. అయితే ఈ కేసుపై ఇప్పుడే చర్యలు తీసుకోలేమని మార్ఫింగ్ ఫొటోలపై క్లారిటీ వచ్చాక చర్యలు తీసుకుంటామని రాజోలు సీఐ తెలిపారు.