సీఎం సహాయనిధి ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలకు లబ్ధి చేకూరిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామానికి చెందిన ఇద్దరు
వైసీపీ గృహ సారథులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాపాక చొరవతో వారికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 5 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు శనివారం ఎమ్మెల్యే రాపాక అందించారు.