
పి.గన్నవరం: తాటిపాక నీటి సంఘం ఛైర్మన్ కు సన్మానం
తాటిపాక నీటి సంఘ ఛైర్మన్ కృష్ణమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మామిడికుదురు మండలం మగటపల్లిలో పి. గన్నవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణమోహన్ ను రాంబాబు ఘనంగా సన్మానించారు. మగటపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కుంపట్ల బాజ్జి, మామిడిశెట్టి రామకృష్ణ, లూటుకుర్తి గోవింద్, వాసంశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు.