రాజోలు అంబేడ్కర్ సామాజిక భవనంలో గురువారం ఉపాధి రీత్యా గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్ సీస్ మేన్ పవర్ కంపెనీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళాకు సుమారు 300 నిరుద్యోగులు హాజరయ్యారు. గ్రీసు, జర్మనీ, జపాన్, ఇజ్రాయిల్, దుబాయ్ దేశాలలో హౌస్ కీపింగ్, వెయిటర్స్, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు చేపట్టారు.