నవంబర్ 22న సఖినేటిపల్లిలో జరిగే దేవాదాయ, ధర్మాదాయ కౌలు రైతుల జిల్లా సదస్సును విజయవంతం చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెల్లిబోయిన కేశవశెట్టి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సఖినేటిపల్లి మండలం శృంగవరపాడులో జరిగిన కౌలు రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ, రాష్ట్ర రైతు సంఘం నాయకులు పాల్గొంటారని తెలిపారు.