కాకినాడ జిల్లా తుని పట్టణంలో సైబర్ కంప్లైంట్ పేరుతో ఒక వ్యక్తిని బెదిరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నం చేశారు. తప్పుడు కంప్లైంట్ ను సైతం ఆయన వాట్సాప్ కు పంపించి డబ్బులు గుంజేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని పట్టణ పోలీసులకు సగటు వ్యక్తి చేరవేయగా అది దొంగ కంప్లైంట్ అని తేలింది. దీంతో ఇలాంటి సైబర్ కేసులు పట్ల అప్రమత్తంగా ఉండాలని పట్టణ పోలీసులు పేర్కొంటున్నారు.