ఆలమూరు: 104 సిబ్బందికి వేతనాలు చెల్లించాలి
మూడు నెలలుగా జీతాలు లేక ఆకలితో అల్లాడుతున్న 104 వాహనాల సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 104 సిబ్బంది నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా.. ఆలమూరు మండలం చొప్పెల్ల పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ సువర్చలాదేవికి మంగళవారం మండలంలోని 104 సిబ్బంది, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. జీవో నంబర్ 7 ప్రకారం వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు.