May 14, 2024, 16:05 IST/కొల్లాపూర్
కొల్లాపూర్
ఘనంగా భగీరథ జయంతి ఉత్సవాలు
May 14, 2024, 16:05 IST
కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో సాగర సంగం ఆధ్వర్యంలో శ్రీ భగీరథ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం మహిళ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, సగర సంగం మండల అధ్యక్షులు ఎస్ రామచంద్రయ్య, ప్రసాద్, సత్యనారాయణ, రంజిత్, ధీరజ్, గౌతం, ప్రీతం, తదితరులు పాల్గొన్నారు.