విండీస్‌తో రెండో టీ20లో శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ఆకట్టుకున్నారు. షామార్ జోసెఫ్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా ఆరు ఫోర్లు బాదారు. తొలి బంతి లెగ్ బై ఫోర్ వెళ్లగా, ఆ తర్వాత 4, WD, 4, 4, 4, 4 కొట్టారు. మొత్తంగా 54 రన్స్ చేశారు. దీంతో లంక తొలుత 161/5 స్కోర్ చేయగా, విండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. దీంతో 3 టీ20ల సిరీస్‌లో ఇరు జట్లూ 1-1తో ఉన్నాయి. ఎల్లుండి కీలకమైన మూడో టీ20 జరగనుంది.