GREAT: గుండెపై 'రతన్ టాటా' ఫోటోను టాటూ వేయించుకున్నాడు

85చూసినవారు
దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ముఖ చిత్రాన్ని తాజాగా ఓ వ్యక్తి తన గుండెపై టాటూ వేయించుకున్నాడు. ఈ వీడియోను టాటూ ఆర్టిస్ట్ మహేశ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కొన్నేళ్ల క్రితం తన ఫ్రెండ్‌కి క్యాన్సర్ రావడంతో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేక.. టాటా ట్రస్ట్‌ సాయంతో ఉచితంగా వైద్యం చేయించుకున్నాడని చెప్పారు. తాను రతన్‌ టాటాను నిజజీవిత దేవుడిగా భావిస్తానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్