వనపర్తి: ట్రాక్టర్ అడ్డగించిన నాగుపాము..!

81చూసినవారు
వనపర్తి జిల్లా పానగల్ మండలం చింతకుంటలో ఓ రైతు పొలంలో మంగళవారం నాలున్నర అడుగుల నాగుపాము బుసలు కొడుతూ హల్చల్ చేసింది. గ్రామానికి చెందిన శివమ్మ పొలంలో ట్రాక్టర్ సాయంతో మినుములు వేస్తుండగా నాగుపాము ట్రాక్టర్ కు ఎదురుగా వచ్చి అడ్డగించింది. ట్రాక్టర్ ఎటు వెళ్తే అటువైపు అనుసరిస్తూ సుమారు గంట సమయం అక్కడే ఉండిపోయింది. సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ కు సమాచారం ఇవ్వగా పామును చాకచక్యంగా పట్టుకుని తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్