Mar 30, 2025, 06:03 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
Mar 30, 2025, 06:03 IST
యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబిసి, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 5 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.