గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ ఆర్ అండ్ ఆర్ కాలనీ నందు గురువారం పేకాటఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు దాడిచేసి అదుపులోకి తీసుకున్నట్లు గోకవరం ఎస్ఐ కూన నాగరాజు గురువారం తెలిపారు. వారివద్దనుండి 16320 రూపాయల నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనంచేసుకుని, వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఏవిధమైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠినచర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.