Nov 16, 2024, 17:11 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
మహబూబ్ నగర్: నగర సంకీర్తనతో హిందూ చైతన్య రథయాత్ర
Nov 16, 2024, 17:11 IST
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు విభాగ్ ధర్మజాగరణ వారి ఆధ్వర్యంలో మద్దూరు మండలంలో ప్రారంభించిన హిందూ చైతన్య రథయాత్ర శనివారం నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. స్థానిక హరే రామ హరే కృష్ణ సంస్థ సభ్యులు, విహెచ్పి , బజరంగ్ దళ్ నాయకులు చైతన్య రథయాత్రకు స్వాగతం పలికారు. పల్ల ఆంజనేయస్వామి ఆలయం నుంచి నగర సంకీర్తనతో పట్టణంలోని పురవీధుల గుండా చైతన్య రథయాత్రను నిర్వహించారు. హిందూ ధర్మ ఆచారాలను వివరిస్తూ యాత్ర కొనసాగింది.