వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆక్వా కాలుష్యంపై పవన్ ఆగ్రహం
జలకాలుష్య నియంత్రణ అంశంలో అధికారులపై డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ ఆగ్రహించారు. కరప మండలం గురజనాపల్లిలో వ్యర్థాలు వదిలే కంపెనీలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. గురజనాపల్లిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రొయ్యలఫ్యాక్టరీ ఆక్వా కాలుష్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా పీసీబీ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.