కోటనందూరు మండలం - Kotananduru Mandal

జోగులాంబ గద్వాల జిల్లా
నేడు పాలమూరులో వినాయక నిమజ్జనోత్సవం
Sep 16, 2024, 02:09 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం

నేడు పాలమూరులో వినాయక నిమజ్జనోత్సవం

Sep 16, 2024, 02:09 IST
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాడవాడల వెలసి.. భక్తులచే విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య నిమజ్జనానికి తరలనున్నాడు. వెయ్యికి పైగా వినాయకులను సోమవారం నిమజ్జనం చేయనున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గంగోసుకుంటలో, పాలకొండ చెరువులో, చిన్నదర్పల్లి చెరువు, వెంకటాపూర్ చెరువులో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. అలాగే బీచుపల్లిలోని కృష్ణానదిలో నిమజ్జనం చేసే భారీ విగ్రహాల కోసం ఆర్టీఏ, మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన 25 లారీలలో నిమజ్జనానికి తరలించనున్నారు.