Nov 10, 2024, 07:11 IST/
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి
Nov 10, 2024, 07:11 IST
యూపీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నోయిడా నుంచి ప్యారీ చౌక్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి.. ముందుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.