Sep 24, 2024, 14:09 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేయాలి: కలెక్టర్
Sep 24, 2024, 14:09 IST
ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులను ఈనెల30 తేదీ వరకు పరిష్కరించాలని
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో ధరణిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్లో భూములకు సంబంధించిన దరఖాస్తులు, పెండింగ్ మ్యూటేషన్లు అన్ని రకాల దరఖాస్తులను త్వరతిగతిన పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్డీవోలు, ఎమ్మార్వోలను ఆదేశించారు