Sep 18, 2024, 12:09 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
వేతనాలు ఇవ్వాలని ధర్నా
Sep 18, 2024, 12:09 IST
జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నారాయణపేట జిల్లా ఆసుపత్రి వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ. ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టం అమలు చేయాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.