Nov 18, 2024, 14:11 IST/
మరో కంపెనీపై ఐటీ దాడులు
Nov 18, 2024, 14:11 IST
TG: హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గతంలోనూ ప్రముఖ ఇండ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ అధికారులు ఈరోజు (నవంబర్ 18న) నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన.. స్వస్తిక్ రియల్టర్ కంపెనీ టార్గెట్గా సోదాలు చేస్తోంది. కంపెనీ మేనేజర్లు అయిన కల్పనా రాజేంద్ర, లక్ష్మణ్ ఇండ్లతో పాటు షాద్ నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.