ఘనంగా భారత రిపబ్లిక్ అండ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ముమ్మిడివరంలో భారత రిపబ్లిక్ అండ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అంబేడ్కర్ స్థాపించిన భారత రిపబ్లిక్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నగరపంచాయతీ ఆవరణలో బుద్ధపార్క్ వద్ద ఆర్పీఐ జిల్లా అధ్యక్షులు జ్ఞానప్రకాష్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. నియోజకవర్గ ఆర్పీఐ కన్వీనర్ నరసింహమూర్తి పతాకావిష్కరణ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి భారత రిపబ్లిక్ అండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రుషి పూలమాల వేశారు.