ముమ్మిడివరం: 14న కలెక్టరేట్ వద్ద ధర్నా
ముమ్మిడివరంలో సీపీఎం నాయకులు సోమవారం ప్రజా పోరు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ ప్రజాపోరును నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 14న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే భారీ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.