ముమ్మిడివరం మండలం లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ మహమ్మద్ రహమతుల్లా ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో శుక్రవారం జాతీయ న్యాయ సేవా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయస్థానాలు అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలపై అవగాహన కల్పించారు. అనంతరం బల్ల గేటు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.