పెదపూడి: దోమడలో భూ రీ సర్వే గ్రామసభ
పెదపూడి మండలం దోమడ గ్రామపంచాయతీ వద్ద శనివారం కూటమి నాయకులు కాకర్ల గోవిందు, మద్దిపూడి దొరబ్బాయి ఆధ్వర్యంలో.. భూ రీ సర్వే గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపూడి తహసిల్దార్ సీతాపతి రావు మాట్లాడుతూ.. రైతులకు ఈ కార్యక్రమం ద్వారా భూ రీసర్వే పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ విఆర్ఓ నాగేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది రైతుల నుండి భూ సర్వేకి సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు.