దిగ్విజయంగా పూర్తయిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం
అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినది. సోమవారం ఉదయం 6 గంటల నుండి కూడా లబ్ధిదారులందరికీ 7వేల రూపాయలు పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సహాయ సహకారంతో జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తల స్ఫూర్తితో కార్యక్రమం ముగియడం జరిగింది.