ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. నారాయణపేట కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలు తీసుకున్నారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.