రామచంద్రపురం: పుస్తక పఠనం మేధో సంపత్తిని పెంపొందిస్తుంది
పుస్తక పఠనం మేధోసంపత్తిని పెంపొందిస్తుందని ప్రముఖ న్యాయవాది పి. వి. సూర్యారావు, వీఆర్వో పి. గోవిందరాజు అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా రామచంద్రపురం ప్రధమ శ్రేణి గ్రంథాలయంలో శుక్రవారం లైబ్రేరియన్ డి. వెంకటరమణ అధ్యక్షతన పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యారావు, గోవిందరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియోగించు కోవాలని కోరారు.