
ద్రాక్షారామంలో మంత్రి సుభాష్ పూజలు
"మహాశివరాత్రి" పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ద్రాక్షారామం గ్రామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం, గొల్లపాలెం గ్రామంలోని శివాలయంలో, హసన్ బాద్ గ్రామంలోని శివాలయంలోనూ సర్వాంతర్యామి, భోలాశంకరుడు, పరమశివుని దర్శించుకొని ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.