తాళ్లరేవు: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
తాళ్లరేవు మండలంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 33/11 కేవీ తాళ్లరేవు సబ్ స్టేషన్, నిర్వహణ పనుల నిమిత్తం మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని కాకినాడ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉదయభాస్కర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.