తాళ్లరేవు మండలం తాళ్లరేవు లయన్స్ క్లబ్ వారు వరద బాధితుల సహయార్థం రూ. 50000 వేల విరాళం అందజేశారు. లయన్స్ ఇంటర్నేషనల్, న్యూ మెంబర్స్ ఓరియంటేషన్ ట్రైనింగ్ సందర్భంగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం అందించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ పేరయ్య రాజును జిల్లా గవర్నర్ లయన్ ఈవీవీ ఈశ్వర్ కుమార్, ఐపీడీజీ లయన్ సూర్యనారాయణ వారిని శాలువాతో ఆదివారం సత్కరించారు.