తాళ్లరేవు: ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ ప్రమాదం

64చూసినవారు
తాళ్లరేవు: ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ ప్రమాదం
ప్లాస్టిక్ వస్తువులు అతిగా ఉపయోగిస్తే క్యాన్సర్ కు కారకం అవుతాయని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేష్ తెలిపారు. చొల్లంగి వివేకానంద పాఠశాలలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో విద్యార్థులకు పలు విషయాలపై ఫారెస్ట్ అధికారులు శనివారం అవగాహన కలిగించారు. మైక్రో ప్లాస్టిక్ కలిగిన టీ గ్లాసులు, కవర్లలో వేడి పదార్థాలు ఆహారంగా తీసుకోవడం ద్వారా ప్లాస్టిక్ ఆహారంతో కలిసిపోయి చిన్న, పెద్ద ప్రేగుల్లో పేరుకుపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్