తాళ్లరేవు: ఇంటింటికీ రిలయన్స్ గ్యాస్ అందించాలి: సీపీఎం
తాళ్లరేవు మండల ప్రజానీకానికి రిలయన్స్ చమురు సంస్థ ఇంటింటికి పైప్లాన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. తాళ్లరేవు సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా నాయకుడు శ్రీనివాస్ విలేకర్లతో ఆదివారం మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా రిలయన్స్ తాళ్లరేవు మండలం నుంచి గ్యాస్ తరలించుకుపోయి లక్షల కోట్ల రూపాయలు అర్జిస్తున్నా ఇక్కడ ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు.