ముమ్మిడివరం: ఆస్తి తగాదా హత్య కేసు వివరాలు వెల్లడించిన సీఐ
తాళ్లరేవు మండలం పి. మల్లవరంలో ఆదివారం ఉదయం అన్నదమ్ముల మధ్య జరిగిన హత్యకు కారణం ఆస్తి వివాదమే అని కోర్టులో కూడా కేసు నడుస్తుందని కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన సీఐ మీడియాతో మాట్లాడుతూ. హత్య చేసిన వ్యక్తి ఏడుకొండలు అని మరణించిన వ్యక్తి అతని తమ్ముడు నూకరాజు అని ఆయన తెలిపారు. ముద్దాయిని తొందరలోనే పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామన్నారు.