AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో పార్లమెంట్ సమావేశాల పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాలతో శరత్ చంద్రారెడ్డి విచారణకు హాజరుకాలేదు. దాంతో ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కాగా, వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మరోసారి ఆయనను విచారించనున్నట్లు సమాచారం.