పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా సి. నాగరాణి ను కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈమె ఇంతకు ముందు ఐటీడీఏ, గ్రామీణ ఉపాధి, చేనేత జౌళి, సాంకేతిక విద్య వంటి కీలక శాఖలో పని చేయగా ఇప్పుడు తొలిసారి కలెక్టర్ బాధ్యతలను చేపట్టనున్నారు. రేపు శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా సి. నాగరాణి పదవి బాధ్యతలను చేపట్టనున్నట్లు జిల్లా సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపారు.