చింతలపూడి బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ అండర్-14, 17, 19 పోటీలు నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయులు పీఎస్ సుధాకర్ గురువారం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 78 జట్లు 390 మంది క్రీడాకారులు, 30మంది శిక్షకులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి, డీఈవో వెంకటలక్ష్మమ్మ ఈ పోటీలను ప్రారంభిస్తారని వెల్లడించారు.