ఏలూరు జిల్లా కామవరపుకోట మండల సమీపంలోని ఉప్పలపాడు శివారు గొల్లగూడెం వద్ద శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రహదారికి భారీ గండి పడింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి గండిని పుడ్చాలని కోరుతున్నారు. అలాగే రహదారికి గండి పడిన నేపథ్యంలో ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.