ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేశారు.