నూతన వరవడికి శ్రీకారం చుట్టిన దెందులూరు ఎమ్మెల్యే

62చూసినవారు
దెందులూరు చింతమనేని ప్రభాకర్ నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. "గివ్ బ్యాక్ " పేరుతో చింతమనేని క్యాంప్ కార్యాలయంలో వివిధ హోమ్స్ లో ఉన్న నిరుపేద విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తనను కలవడానికి వచ్చిన వ్యక్తులు గౌరవ సూచకంగా ఇచ్చిన శాలువాలతో అనాధ పిల్లలకు బట్టలు కుట్టించి సుమారు 200 మందికి అందజేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇలా చేయడం వల్ల చాలామందికి మేలు జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్