ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినం సందర్బంగా కలిదిండి మండల బిజెపి ఆధ్వర్యంలో కలిదిండి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామంజనేయ చౌదరి ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి వైద్య శిబిరానికి వచ్చిన వారిని విజయవాడ స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. నాయకులు పాల్గొన్నారు.