గొడ్డలితో తమ్ముడిపై అన్న దాడి

1916చూసినవారు
గొడ్డలితో తమ్ముడిపై అన్న దాడి
చందర్లపాడు మండలంలోని తుర్లపాడులో శనివారం తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడి చేశాడు. SI ధర్మరాజు తెలిపిన వివరాల ప్రకారం సత్యానందం, సత్యంబాబులు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరికీ తల్లికి గృహనిర్మాణ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడు అన్నపై చేయి చేసుకోగా అన్న గొడ్డలితో తమ్ముడి మెడపై నరికాడు. పోలీసులు సత్యానందాన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. క్షతగాత్రుడు విజయవాడలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్