ద్వారకా తిరుమలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున వింత సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా తాచు పాము, జెర్రిపోతు కలిసి సయ్యాటలాడుతూ కనిపించాయి. కానీ రెండు పెద్ద పొడపాములు కలిసి సయ్యాటలాడడం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వింత సంఘటన శివాలయం సమీపంలో చోటు చేసుకోవడం గమనార్హం.