ముసునూరు రక్షణ కోసం ముసునూరు పోలీసులను గురువారం రాత్రి నూతన దంపతులు ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన టి. రాధాకృష్ణ, జిల్లా పెదపాడు మండలం కేఆర్ పాలెం గ్రామానికి చెందిన ఎన్. నవ్య ఏలూరు పట్టణ కేంద్రంలో సోషల్ మ్యారేజ్ సంస్థ వారి ఆధ్వర్యంలో పెళ్లి చేసుకుని మేజర్లమైన తమకు ఎటువంటి ఆపద లేకుండా, న్యాయం కోసం, రక్షణ కోసం పోలీసుల్ని ఆశ్రయించినట్లు వారు తెలిపారు.