Nov 18, 2024, 16:11 IST/
కేటీఆర్ అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరమా?
Nov 18, 2024, 16:11 IST
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కేటీఆర్ అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరమా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అంటూ తమ మీద నిందలు వేసి.. రేవంత్ రెడ్డే కేటీఆర్‌ను కాపాడుతున్నారని ఆరోపించారు.